హీరోయిన్ నో… నాని పేకప్

నేచురల్ స్టార్ నానీ హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మైత్రీమూవీస్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ‘అంటే సుందరానికి’. ఈ సినిమాలో నానికి జోడీగా మలయాళ స్టార్ హీరో పహాద్ ఫాజిల్ భార్య, హీరోయిన్ అయిన నజ్రియా నజీమ్ నటిస్తోంది. తెలుగులో అమ్మడికి ఇదే తొలి సినిమా. ఇటీవల ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అయింది హీరోయిన్ నజ్రియా. నాలుగు రోజుల పాటు షూటింగ్ కూడా చేసింది. అయితే కరోనా సెకండ్ వేవ్ ఉధృతం అయిన నేపథ్యంలో ఇక షూటింగ్ లో పాల్గొనలేనని చెప్పిందట ఈ హీరోయిన్. అప్పటి వరకూ కరోనాకి వెరవక ధైర్యంగా షూటింగ్ చేసిన యూనిట్ చేసేదేమి లేక షెడ్యూల్ ని వాయిదా వేసి పేకప్ చెప్పేసింది. తదుపరి షూటింగ్ ఎప్పటినుంచి అనే విషయంలో ప్రస్తుతానికి క్లారిటీలేదు. షూటింగ్ కి బ్రేక్ ఇచ్చిన నజ్రియా భర్త పహాద్ ఫాజిల్ తో కలసి చెన్నై వెళ్ళింది. ఇక ‘అంటే సుందరానికి’ సినిమాకు వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండగా నికేత్ బొమ్మి ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. నానితో మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న రెండో సినిమా ఇది. ఇంతకు ముందు వీరి కలయికలో వచ్చిన ‘గ్యాంగ్ లీడర్’ ఆడియన్స్ ను నిరాశపరిచింది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-