‘బాహుబలి: బిఫోర్ ద బిగినింగ్’ లో నయనతార!

నెట్ ఫ్లిక్స్ కోసం ఎస్. ఎస్. రాజమౌళి, ఆర్కా మీడియా సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘బాహుబలి : బిఫోర్ ద బిగినింగ్’ వెబ్ సీరిస్ కథ మళ్ళీ మొదటికి వచ్చింది. బాలీవుడ్ నటి, ‘తూఫాన్’ ఫేమ్ మృణాల్ ఠాకూర్… శివగామి పాత్రధారిణిగా ఇప్పటికే కొన్ని ఎపిసోడ్స్ ను చిత్రీకరించారు. కానీ అవి ఆశించిన స్థాయిలో రాకపోవడంతో వాటన్నింటినీ పక్కన పెట్టేశారట. మళ్ళీ కొత్తగా డేట్స్ ఇవ్వడానికి మృణాల్ ఠాకూర్ సిద్ధంగా లేకపోవడంతో శివగామి పాత్ర కోసం ఇప్పుడు వామికా గబ్బిని ఎంపిక చేశారు. గతంలో తెలుగులో సుధీర్ బాబు ‘భలే మంచి రోజు’తో పాటు, తమిళ అనువాద చిత్రం ‘నన్ను వదిలి నీవు పోలేవులే’ తో తెలుగు వారికి వామికా గబ్బి సుపరిచితురాలే.

Read Also: ‘మా’ పోరు రెబల్ స్టార్ తీర్చగలరా!?

ఆనంద నీలకంఠన్ నవల ‘ది రైజ్ ఆఫ్ శివగామి, చతురంగ అండ్ క్వీన్ ఆఫ్ మాహిష్మతి’ ఆధారంగా ‘బాహుబలి : బిఫోర్ ద బిగినింగ్’ వెబ్ సీరిస్ ను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇంతవరకూ చిత్రీకరించిన సన్నివేశాలు అప్ టు ద మార్క్ లేవని భావించిన నెట్ ఫ్లిక్స్ సంస్థ ఇప్పుడు రెట్టింపు బడ్జెట్ ను కేటాయించిందట. అందుకే ఈ వెబ్ సీరిస్ కు మరింత క్రేజ్ తీసుకురావడానికి సౌతిండియన్ స్టార్ హీరోయిన్ నయన తారను రంగంలోకి దించుతున్నారట మేకర్స్. ‘బాహుబలి: బిఫోర్ ద బిగినింగ్’లో నయన్ ఓ కీలక పాత్ర పోషించబోతోందనే ప్రచారం ముమ్మరంగా జరుగుతోంది. అదే నిజమైతే… ఆమె నటిస్తున్న తొలి వెబ్ సీరిస్ ఇదే అవుతుంది. నయనతార నటించిన ‘అమ్మోరు తల్లి’ అనువాద చిత్రం ఆ మధ్య కరోనా కారణంగా థియేటర్లలో విడుదల కాకుండా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అయ్యింది. అందులో గ్రామదేవతగా నయనతార చక్కని నటన ప్రదర్శించి విమర్శకుల, వీక్షకుల ప్రశంసలను అందుకుంది. మరి నిజంగానే నయనతార ‘బాహుబలి’కి ప్రీక్వెల్ అయిన ఈ వెబ్ సీరిస్ లో నటిస్తే అది టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయిపోతుంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-