పెళ్లి తర్వాత కీలక నిర్ణయం తీసుకోనున్న నయన్ ?

లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం చేతిలో వున్నా సినిమాలను త్వరగా పూర్తిచేసే పనిలో పడింది. కరోనా వేవ్ తో నయన్ అనుకున్న ప్లాన్స్ అన్ని కూడా తారుమారు అయ్యిపోయాయి. ఇదిలావుంటే, నయన్ కొద్దిరోజుల్లోనే పెళ్లి పీటలు ఎక్కనుందనే వార్తలు కోలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తున్నాయి. తమిళ యువ దర్శకుడు విగ్నేష్ శివన్ తో నయనతార ప్రేమ కథకు త్వరలోనే ఒక హ్యాపీ ఎండింగ్ దొరకబోతోందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వీరిద్దరి ఎంగేజ్మెంట్ సీక్రెట్ గా జరిగిందని వార్తలు గతంలోనే వినిపించగా.. నయన్ చేతి వెలికి ఎంగేజ్మెంట్ రింగ్ కూడా కనిపిస్తోన్న సంగతి తెలిసిందే.

అయితే, నయన్ పెళ్లి తరువాత సినిమాలు ఆపేస్తున్నట్లు నిర్ణయం జరిగినట్లుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న సినిమాలు తప్ప, కొత్త సినిమాలకు కమిట్మెంట్ ఆపేసిందనే న్యూస్ ఎక్కువగా సర్క్యూట్ అవుతోంది. అయితే నయన్ దర్శకత్వ బాధ్యతలు తీసుకోనుందని తెలుస్తోంది. ఈమేరకు ప్రియుడు విగ్నేష్ దగ్గర ట్రైన్ అవుతుందట.. పెళ్లి తరువాత విగ్నేష్ చేసే సినిమాలను ఆమె కొద్దిరోజుల పాటు దగ్గర ఉండి మరి చూసుకోనుందట.. ఇక నయన్ కూడా ఎప్పటినుంచో డైరెక్షన్ లోకి ఎంటర్ అవుదామనుకొంటోన్న సంగతి తెలిసిందే. ఏదిఏమైనా వీరిద్దరూ ప్రేమ వ్యవహారం మరోసారి సౌత్ లో హాట్ టాపిక్ గా మారింది.

Related Articles

Latest Articles

-Advertisement-