వైరల్ వీడియో: అవును.. అది జరిగింది: నయన్

లేడీ సూపర్‌స్టార్‌ నయనతార గత నాలుగేళ్లుగా తమిళ డైరెక్టర్‌ విఘ్నేష్‌ శివన్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్న సంగతి తెలిసిందే. ఇక వీరి రొమాంటిక్ ఫోటోలను కూడా నయన్ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. అయితే ఆమధ్య నయన్ పోస్ట్ చేసిన ఫొటోలో ఆమె చేతికి రింగ్ తళుక్కున మెరవడంతో ఎంగేజ్‌మెంట్‌ అయినట్లుగా వార్తలు వచ్చాయి. కరోనా సెకండ్ వేవ్ తర్వాత పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ప్రచారం జరిగింది. అయితే ఇదివరకు వారు దీనిని ధృవీకరించలేదు. వారిద్దరూ సహజీవనం మాత్రమే కొనసాగిస్తున్నారని, పెళ్లి చేసుకొనే ఆలోచన వారికీ లేదంటూ కోలీవుడ్ లోను ఎక్కువ వార్తలే వినిపించాయి. అయితే, తాజాగా నయన్ తన ఎంగేజ్‌మెంట్‌ పై స్పందించింది. ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె తనకు ఎంగేజ్‌మెంట్‌ అయ్యిందని, దానికి సంబంధించి రింగ్‌ను చూపించి అందరికి షాకిచ్చింది. అయితే ఇది ప్రోమో కాబట్టి, ఏమైనా ట్వీస్ట్ ఉంటుందా? లేదా నిజంగా నయన్ కు ఎంగేజ్‌మెంట్‌ జరిగిందా! అనేది తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వచ్చేదాకా ఆగాల్సిందే..!

Related Articles

Latest Articles