ఆ స్టార్ హీరోల ఇంటిపక్కనే ఇల్లు కొన్న నయనతార.. అందుకేనా?

లేడీ సూపర్ స్టార్ నయనతార వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆమె నటించిన ‘పెద్దన్న’ విడుదలై మంచి విజయాన్ని అందుకొంది. మరోపక్క నయన్, ప్రియుడితో కలిసి వెకేషన్స్ ఎంజాయ్ చేస్తోంది. ఇటీవల నయన్ బర్త్ డే వేడుకలను విగ్నేష్ గ్రాండ్ గా చేసిన విషయం తెలిసిందే. త్వరలోనే ఈ జంట పెళ్లితో ఒక్కటి కానున్నారు. ఈ నేపథ్యంలోనే నయన్ ఒక కొత్త ఇంటిని కొనుగోలు చేసినట్లు కోలీవుడ్ లో వార్తలు గుప్పుమంటున్నాయి. స్టార్ హీరోలు నివాసముండే పోయెస్ గార్డెన్ లో అమ్మడు ఒక ఇంటిని కొనుగోలు చేసిందట.

దివంగత నేత జయలలిత, సూపర్ స్టార్ రజినీకాంత్, ధనుష్ నివాసాలు పోయెస్ గార్డెన్ లోనే ఉన్నాయి. ఆస్టార్ హీరోల ఇంటి పక్కనే నయన్ ఒక ఇల్లును కొనుగోలు చేసిందట. ప్రస్తుతం ఆ ఇల్లును రెన్యూవేషన్ చేయించే పనుల్లో ఉందట నయన్.. పెళ్లి తరువాత భర్తతో కలిసి ఆమె అక్కడకు షిఫ్ట్ కానుందని సమాచారం. ఇకపోతే ప్రస్తుతం నయన్ ‘‘ కాతువాకుల రెండు కాదల్ ’’ సినిమా విడుదలకు సిద్దమవుతుంది. ఈ సినిమాను ఆమె సొంత బ్యానర్ లో ప్రియుడు విగ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది.

Related Articles

Latest Articles