షారూఖ్‌ కోసం పూణే వెళ్ళిన నయన్, ప్రియమణి

బాలీవుడ్ స్టార్ షారూఖ్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కలయికలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా పూణేలో ప్రారంభమైంది. ఈ సినిమాలో షారూఖ్ సరసన దక్షిణాది తారలు నయనతార, ప్రియమణి నటిస్తున్నారు. ఈ సినిమాకు వర్కింగ్ టైటిల్ గా ‘సంకి’ అనే పేరు పెట్టారు. మిలిటరీ బ్యాక్ డ్రాప్ లో అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో షారూఖ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు వినిపిస్తోంది. ఈ సినిమాను 2022లో విడుదల చేయనున్నారు. మరో వైపు ‘పఠాన్’ సినిమాను పూర్తి చేసిన షారూఖ్ ఆశలన్నీ ప్రస్తుతం ఈ రెండు సినిమాలపైనే ఉన్నాయి. గత కొంత కాలంగా నిరాశలో ఉన్న షారూఖ్ అభిమానులు ఇప్పుడు ఉత్సాహంగా ఈ రెండు మూవీస్ కోసం ఎదురుచూస్తున్నారు. షారూఖ్ సొంత సంస్థ రెడ్ చిల్లీస్ నిర్మిస్తున్న ‘సంకి’ సినిమాకు తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ పాటలు అందించబోతున్నాడట.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-