‘మాయ’ డైరెక్టర్ తో నయన్ ‘కనెక్ట్’

స్టార్ హీరోయిన్ నయనతార నాయికగా నటించిన 50వ చిత్రం ‘మాయ’. 2015లో విడుదలైన ఈ తమిళ సినిమా తెలుగులో ‘మయూరి’ పేరుతో డబ్ అయ్యింది. కన్నడలో రీమేక్ అయ్యింది. మూడు భాషల్లోనూ ప్రేక్షకుల ఆదరణ పొందింది. దాంతో ఆ చిత్ర దర్శకుడు అశ్విన్ శరవణ మరోసారి నయనతారను డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. ఈ సారి వీరిద్దరి కాంబినేషన్ లో మరో హారర్ మూవీని దర్శక నిర్మాత, నయన్ ప్రియుడు విఘ్నేష్ శివన్ నిర్మించబోతుండటం విశేషం. విఘ్నేష్ సొంత బ్యానర్ రౌడీ పిక్చర్స్ పై ఈ సినిమా నిర్మితం కానుంది. నయనతార పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాను విఘ్నేష్ ప్రకటించాడు. ‘కనెక్ట్’ పేరుతో తెరకెక్కబోతున్న ఈ మూవీలో సీనియర్ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ తో పాటు సత్యరాజ్ కీలక పాత్ర పోషించబోతున్నాడు.

Related Articles

Latest Articles