ఆ జంటకు విలన్ గా మారిన నయనతార..?

లేడీ సూపర్ స్టార్ నయనతార విలన్ అవతారం ఎత్తబోతుందా..? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. ప్రస్తుతం నయనతార, విజయ్ సేతుపతి, సమంత ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘కాతువాకుల రెండు కాదల్’. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్దమవుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ , సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

ఇక తాజాగా ఈ సినిమా కథ గురించి, నయనతార పాత్ర గురించి కోలీవుడ్ లో పెద్ద రచ్చే జరుగుతుంది. ఈ చిత్రంలో సామ్, విజయ్ సేతుపతి ప్రేమికులుగా కనిపించనుండగా.. వారిని విడదీసే విలన్ పాత్రలో నయన్ కనిపించనున్నదంట. సామ్ ని విడదీసి తాను , విజయ్ కి దగ్గరవ్వాలని చూసే పాత్రలో నయన్ కనిపిస్తోందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మరి నయన్ విలనిజం ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలంటే సినిమా రిలీజ్ అయ్యేవరకు ఆగాల్సిందే. ఇక ఈ సినిమాకు విగ్నేష్ శివం దర్శకత్వం వహిస్తుండగా.. రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై నయన్ ,విగ్నేష్ సొంతంగా నిర్మిస్తున్నారు.

Related Articles

Latest Articles