పంజాబ్‌లో కీలక పరిణామం.. పీసీసీ చీఫ్‌ పదవికి సిద్ధూ రాజీనామా

పంజాబ్‌లో రాజకీయ సంక్షోభం రోజుకో మలుపు తిరుగుతూనే ఉంది.. ఇటీవలే సీఎం పదవికి రాజీనామా చేసిన కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్.. సిద్ధూను ఎప్పటికీ సీఎంను కానివ్వను అంటూ చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి.. మరోవైపు.. పంజాబ్‌ కాంగ్రెస్‌లో పొలిటికల్ డ్రామా తారాస్థాయికి చేరింది.. పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేశారు నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ.. ఈ మేరకు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాశారు. అయితే, తాను పార్టీని వీడడం లేదని.. మరికొన్ని రోజులు కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని పేర్కొన్నారు.

కాగా, ఇటీవలే సీఎం అమరీందర్‌ సింగ్‌ తన పదవికి రాజీనామా చేశారు.. ఈ సందర్భంగా సిద్ధూపై సంచలన వ్యాఖ్యలు చేశారు.. సీఎం పదవి సిద్ధూకు ఇస్తే ఊరుకోనని హెచ్చరించారు కూడా.. దాంతో అధిష్టానం పంజాబ్‌ సీఎంగా చరణ్‌సింగ్‌ను నియమించింది.. ఇక, రాజకీయ సంక్షోభం ముగిసిందనుకున్న సమయంలో.. ఉన్నట్టుండి సిద్ధూ పీసీసీ చీఫ్‌ పదవికి రాజీనామా చేయడం హాట్‌ టాపిక్‌గా మారిపోయింది.. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సమయంలో సిద్ధూ రాజీనామా వ్యవహారం చర్చగా మారింది.. ఇక, సిద్ధూ 72 రోజులు పంజాబ్‌ పీసీసీ చీఫ్‌ హోదాలో పనిచేశారు.. మరోవైపు.. బీజేపీలో చేరేందుకు అమరీందర్‌సింగ్‌ రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది.. కాసేపట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో సమావేశం కానున్నారు అమరీందర్‌.. మొత్తంగా మరోసారి పంజాబ్‌ లో పొలిటికల్‌ హీట్ పెరిగింది.

-Advertisement-పంజాబ్‌లో కీలక పరిణామం.. పీసీసీ చీఫ్‌ పదవికి సిద్ధూ రాజీనామా

Related Articles

Latest Articles