అఫిషియల్ : త్రివిక్రమ్, నవీన్ పొలిశెట్టి కాంబోలో మూవీ

‘జాతిరత్నాలు’తో ఇటీవల బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్న నవీన్ పొలిశెట్టి తరువాత ప్రాజెక్ట్ పై అఫిషియల్ గా ప్రకటన వచ్చింది. ఆయన ఇప్పటికే యూవి క్రియేషన్స్ బ్యానర్ లో సినిమా చేయాల్సి ఉండగా, అది ఇంత వరకూ పట్టాలెక్కలేదు. తాజాగా నవీన్ పోలిశెట్టి, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో సినిమా రూపొందనున్నట్టు ఓ వీడియో ద్వారా తెలియజేశారు. అయితే త్రివిక్రమ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడం లేదు. ఆయన నిర్మాత మాత్రమే.

Read Also : త‌గ్గేదే లే అంటున్న పేర్ని నాని!

త్రివిక్రమ్ తన సొంత బ్యానర్ ఫార్చ్యూన్ 4 సినిమాస్‌ని ప్రారంభించి సినిమా నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్నారు. ఫార్చ్యూన్ 4 సినిమాస్‌, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య, నాగవంశీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ‘జాతి రత్నాలు’ దర్శకత్వ బృందంలో పని చేసిన కళ్యాణ్ శంకర్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తి ఎంటర్టైనర్ గా బలమైన కథతో సాగనున్నట్టు తెలుస్తోంది.

Related Articles

Latest Articles

-Advertisement-