సితార ఎంటర్టైన్మెంట్స్ కు షాకిచ్చిన “జాతిరత్నం”

యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి “ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ”, “జాతి రత్నాలు” సినిమాలతో వరుసగా రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించారు. “జాతి రత్నాలు” సూపర్ హిట్ అయిన తర్వాత నవీన్ పోలిశెట్టికి వరుస ఆఫర్లు వచ్చాయి. కానీ ఈ హీరో ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు సైన్ చేసే మూడ్‌లో లేడు. ఆయన ఇప్పటికే దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, యువి క్రియేషన్స్ తో వరుసగా సినిమాలు చేయడానికి నవీన్ పోలిశెట్టి అడ్వాన్సులు తీసుకున్నాడు. కానీ ఇప్పటి వరకూ నవీన్ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించలేదు.

Read Also : సామ్ విషయంలో నాగ్ మౌనం… కారణం?

ప్రస్తుతం నవీన్ పోలిశెట్టితో ఒక ప్రాజెక్ట్ కోసం సితార ఎంటర్‌టైన్‌మెంట్‌తో చర్చలు జరుపుతున్నారు. అయితే ఈ చిత్రం ఆగిపోయింది. ఓ నూతన దర్శకుడు తన స్క్రిప్ట్‌తో నవీన్ పోలిశెట్టిని ఆకట్టుకున్నాడు. కానీ ఆ కథలో ఈ హీరో అనేక మార్పులను సూచించాడు. అయితే హీరో చెప్పిన మార్పులకు దర్శకుడు సిద్ధంగా లేకపోవడంతో ఈ సినిమాను నిలిపివేశారని సమాచారం. దీంతో ఆయన ఇటీవల ప్రొడక్షన్ హౌస్ నుంచి తీసుకున్న అడ్వాన్స్‌ని తిరిగి ఇచ్చేశాడట. ఇప్పుడు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ ప్రతిభావంతుడైన నటుడి కోసం కొత్త స్క్రిప్ట్‌ల వేటలో పడిందని సమాచారం. ఇదిలా ఉండగా నవీన్ పోలిశెట్టి యువి క్రియేషన్స్ కోసం ఒక చిత్రానికి సంతకం చేసాడు. ఈ చిత్రాన్ని దసరాకు ప్రారంభించాలని భావిస్తున్నారు. మరోవైపు ఈ హీరో రెమ్యూనరేషన్ కూడా సంచలనంగా మారింది. ఒక్కో సినిమాకు 4 కోట్లు డిమాండ్ చేస్తున్నాడు. “జాతిరత్నాలు” నవీన్ కెరీర్ గ్రాఫ్ నే మార్చేసింది.

Related Articles

Latest Articles

-Advertisement-