ఏపీ గవర్నమెంట్ పై నవదీప్ ‘టమాట’ సెటైర్

టికెట్ రేట్ల విషయంలో ఏపీ గవర్నమెంట్ వ్యవహరిస్తున్న తీరు గురించి సినిమా ప్రముఖుల నుంచి వ్యతిరేకత వస్తోంది. ఇప్పటికే ఈ విషయంపై స్టార్ హీరో చిరంజీవి, బడా నిర్మాత సురేష్ బాబు, తాజాగా బాలకృష్ణ వంటి స్టార్ హీరోలు స్పందించి అన్ని సినిమాలకూ ఒకే టికెట్ రేట్ పెట్టడం సరికాదని, దానివల్ల పెద్ద సినిమాలు నష్టపోతాయని, ప్రభుత్వం తమ నిర్ణయం గురించి మరోసారి పునరాలోచించాలని కోరారు. అయితే తాజాగా యంగ్ హీరో నవదీప్ ఈ విషయంలో ఏపీ గవర్నమెంట్ పై ‘టమాట’ సెటైర్ వేశాడు. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం “సినిమా టిక్కెట్ వర్సెస్ టమాట?” అని ట్వీట్ చేశాడు.

Read Also : సల్మాన్ అభిమానుల పిచ్చి పీక్స్… థియేటర్లో చేయాల్సిన పనేనా ఇది ?

సినిమా టిక్కెట్ల ధరలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీలో బిల్లును ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం వల్ల ఇక నుంచి నిర్మాతలు కానీ, డిస్ట్రిబ్యూటర్లు కానీ టిక్కెట్ ధరలు పెంచే అవకాశం లేదు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం భారీ బడ్జెట్ సినిమాలు, చిన్న సినిమాలకు ఒకే టికెట్ ధర ఉంటుంది. మరోవైపు గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో సరఫరా కొరత కారణంగా టమాట ధరలు పెరుగుతున్నాయి. ఈ రెండు అంశాలను పోల్చిన నవదీప్… ఏపీలో కిలో టమాట ధర కంటే ఒక్క సినిమా టిక్కెట్ ధర తక్కువని పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు విసిరాడని అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో టిక్కెట్ల విషయంలో చాలా మంది టాలీవుడ్ పెద్దలు మౌనంగా ఉండగా, నవదీప్ ప్రభుత్వంపై ఈ సెటైర్‌ను పోస్ట్ చేయడం గమనార్హం. ఈ ‘టమోటా’ సెటైర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Related Articles

Latest Articles