భార్యకు వెరైటీగా బర్త్‌డే విషెస్ తెలిపిన నేచురల్ స్టార్

నేచురల్ స్టార్ నాని ఎవరికైనా బర్త్‌డే విషెస్‌లు చెప్పాలంటే వినూత్నంగా చెప్తుంటాడు. తన భార్యకు కూడా వెరైటీగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. ఈరోజు నాని వైఫ్ అంజనా యలవర్తి పుట్టినరోజు. దీంతో ‘మదర్ ఆఫ్ డ్రాగన్.. వైఫ్ ఆఫ్ పాండా… సెంటర్ ఆఫ్ అవర్ హోమ్, హ్యాపీ బర్త్ డే.. వి లవ్ యూ’ అంటూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా నాని తన భార్యకు విషెస్ తెలిపాడు. మదర్ ఆఫ్ డ్రాగన్ అంటే కుమారుడిని డ్రాగన్ అని… వైఫ్ ఆఫ్ పాండా అంటే తనను తాను పాండాతో నాని పోల్చుకున్నాడు.

భార్యకు వెరైటీగా బర్త్‌డే విషెస్ తెలిపిన నేచురల్ స్టార్

కాగా నాని-అంజనా యలవర్తి ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. అప్పుడప్పుడు నాని తన కుమారుడి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు. ఇక సినిమాల విషయానికి వస్తే నేచురల్ స్టార్ నాని ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ మూవీలో నాని డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నాడు. సాయిపల్లవి, కృతిశెట్టి, మడోనా సెబాస్టియన్ ఈ మూవీలో నాని సరసన నటించారు. ఈ మూవీ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న విడుదల కానుంది.

Read Also: చైతన్యకు సమంత బర్త్ డే విషెస్..?

Related Articles

Latest Articles