ఏపీ సీఎం జగన్‌కు నట్టికుమార్ లేఖ… ఏం రాశారంటే..?

ఏపీ సీఎం జగన్‌కు టాలీవుడ్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ నట్టి కుమార్ లేఖ రాశారు. కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా ఏపీ ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుందని… అందులో భాగంగా థియేటర్లలో ఆక్యుపెన్సీని 50 శాతానికి తగ్గించిందని నట్టి కుమార్ లేఖలో తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మంచిదే అయినా పండగ సీజన్‌లో సినిమాలకు ఎక్కువ కలెక్షన్‌లు ఉంటాయి కాబట్టి 50 శాతం ఆక్యుపెన్సీతో నిర్మాతలు, సినిమా థియేటర్ల యజమానులు నష్టపోతారని అభిప్రాయపడ్డారు.

అందువల్ల పండగ సినిమాల కోసం వారం రోజుల పాటు థియేటర్లలో 100శాతం ఆక్యుపెన్సీకి అనుమతివ్వాలని నట్టికుమార్ సీఎంకు రాసిన లేఖలో కోరారు. అంతేకాకుండా రాత్రిపూట అదనంగా ఇంకో గంట వెసులుబాటు కల్పించాలని నిర్మాత నట్టికుమార్ విజ్ఞప్తి చేశారు. సెకండ్ షో కోసం రాత్రి 12 గంటల వరకు అనుమతివ్వాలని కోరారు. ఇండస్ట్రీలో పెద్ద నిర్మాతలు, చిన్న నిర్మాతలు అందరూ బాగుండేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.

Related Articles

Latest Articles