బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల ధాటికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇప్పటికే 8 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించిన సర్కార్, ప్రజలను అప్రమత్తం చేస్తూ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇక చెన్నైని వర్షాలు ముంచెత్తున్నాయి. చలి, వర్షాలతో ప్రజలు అల్లాడిపోతున్నారు.
Read: దేశంలో చమురుధరలు దిగిరాబోతున్నాయా?
ఇన్ని రోజులుగా, ఈ స్థాయిలో వర్షాలు కురవడం ఇప్పటి వరకు చూడలేదని, భారీ వర్షాలతో అనేక ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు చెబుతున్నారు. రెండు వందల యేళ్లలో ఇంత భారీగా వర్షాలు కురవడం ఇది నాలుగోసారి అని అధికారులు చెబుతున్నారు. మరికొన్ని రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో రాష్ట్ర సర్కార్ అప్రమత్తం అయింది. సీఎం స్టాలిన్ వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలకు ధైర్యం చెబుతున్నారు.