నిన్న బుధవారం నష్టాల్లో బాట పట్టిన సూచీలు నేడు ఎగబాకుతున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాల్లో వెళ్లాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజీ సూచీ సెన్సెక్స్ దాదాపు 500 పాయింట్ల లాభం పడడంతో 52 వేల 300 పైన ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిప్టీ 150 పాయింట్లు ఎగబాకి15 వేల 560 వద్ద లాభాలు పూయిస్తోంది. సెన్సెక్స్ 30 ప్యాక్‌లో అన్నీ లాభాల్లోనే ఉన్నాయి. హీరో మోటోకార్ప్, ఐచర్ మోటార్స్, భారతీ ఎయిర్టెల్, టాటా మోటార్స్, మారుతీ సుజుకీ రాణిస్తున్నాయి. అపోలో హాస్పిటల్, టైటాన్ కంపెనీ, ఓఎన్జీసీ, రిలయన్స్ నష్టపోయాయి.
ఐటీ, ఆటో రంగాల షేర్ల దూకుడుతో మార్కెట్లు లాభాల దిశగా కొనసాగుతున్నాయి. అమెరికా, ఐరోపా మార్కెట్లు బుధవారం నష్టాలను నమోదుచేయడం గమనార్హం. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు కూడా బుధవారం భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 710, నిఫ్టీ 226 పాయింట్లను కోల్పోయాయి.