కేంద్రం రైతు చట్టాలను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. కేంద్రం చట్టాలను వెనక్కి తీసుకోవడంపై ప్రతిపక్షాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. సంవత్సరం కాలంగా రైతులు చేస్తున్న పోరాటం ఫలించిందని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. పంజాబ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సిద్దూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై స్పందించారు.
Read: భారీ వర్షాల ఎఫెక్ట్: తిరుచానూరులో వరద తాకిడికి కొట్టుకుపోయిన ఇల్లు…
ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం సరైన దిశలో ముందడుగు వేసిందని, ఇది కేంద్రంపై రైతులు సాధించిన విజయమని అన్నారు. మూడు వివాదాస్పద చట్టాలకు వ్యతిరేకంగా గతేడాది నవంబర్ 26 వ తేదీ నుంచి రైతులు ఢిల్లీలో ఉద్యమం చేస్తున్నారు. పంజాబ్ నుంచి ప్రారంభమైన ఈ ఉద్యమం దేశవ్యాప్తమైంది. రైతులతో అనేక దఫాలుగా కేంద్రం చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. చట్టాలను వెనక్కితీసుకునే వరకు ఢిల్లీ వదలి వెళ్లేది లేదని రైతులు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఇప్పుడు రైతు చట్టాలను వెనక్కి తీసుకోవడంతో రైతులు ఉద్యమాన్ని విరమించే అవకాశం ఉంది.