వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు జగరబోతున్నాయి. ఆ ఎన్నికల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ అనేక ఎత్తులు వేస్తున్నది. ఇందులో భాగంగా సిద్ధూకు పంజాబ్ కాంగ్రెస్ పగ్గాలు అప్పగించింది. కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను పక్కకు తప్పించి ఆ స్థానంలో ముఖ్యమంత్రిగా చరణ్‌జిత్ సింగ్ చన్నికి అవకాశం ఇచ్చింది. దీంతో పంజాబ్‌లో సంక్షోభానికి తెరపడినట్టే అని అందరూ అనుకున్నారు. అయితే, సడెన్‌గా పంజాబ్ పీసీసీకి సిద్ధూ రాజీనామా చేశారు. ఆయనకు మద్ధతుగా ఓ మంత్రి, ఓ నేత కూడా రాజీనామా చేయడంతో పార్టీ ఖంగుతిన్నది. అయితే, సిద్ధూ రాజీనామాను పార్టీ ఇంకా ఆమోదించలేదు. పంజాబ్ కేబినెట్ ఈరోజు అత్యవసరంగా సమావేశం కాబోతున్నారు. సిద్ధూ అంశంపై చర్చించబోతున్నారు. సిద్ధూ రాజీనామా చేయడానికి కారణం ఎంటి? రాష్ట్ర కాంగ్రెస్‌లో ఏం జరగబోతున్నది అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పంజాబ్ కాంగ్రెస్ అంతర్గత కలహాలపై అటు అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. పంజాబ్ ముఖ్యమంత్రి చన్నీ ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖలను కేటాయించారు. ఉపముఖ్యమంత్రి రణ్‌ధవాకు హోంశాఖను, మరో డిప్యూటిసీఎం ఓపీ సోనీకి ఆరోగ్యశాఖను కేటాయించారు. ఈ శాఖలు కేటాయించిన గంటల వ్యవధిలోనే పంజాబ్ కాంగ్రెస్ పీసీసీగా సిద్ధూ రాజీనామా చేయడంతో పంజాబ్‌లో ఏం జరుగుతుందో తెలియక గందరగోళంలో పడిపోయారు. అయితే, రాజీనామాను కాంగ్రెస్ అధిష్టానం పెండింగ్‌లో ఉంచింది.
Read: జనసేన పార్టీ కీలక సమావేశం… బద్వేల్ ఉప ఎన్నికపై చర్చ…