చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ సహా 13 మంది మృతి చెందిన హెలికాప్టర్ ప్రమాద ఘటన అందరినీ కలచివేసింది.. అయితే, అమరులైనవారి పార్థీవ దేహాలను తరలించే మార్గంలో పూల వర్షం కురిపించారు ప్రజలు.. అంబులెన్స్‌లు రాగానే పూల వర్షం కురిపిస్తూ.. భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు.. నీల్‌గిరి జిల్లాలోని మద్రాస్ రెజిమెంట్ సెంటర్ నుంచి వారి భౌతికకాయాలను సూలూర్ ఎయిర్‌బేస్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రజలు రోడ్లకిరువైపులా నిలబడి పూల వర్షం కురిపించారు.. అయితే ఆ వీడియోలు, ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి..
Read Also: ఇది తాత్కాలికమే.. మాట తప్పితే మళ్లీ ఉద్యమం..!
కాగా, తమిళనాడులో నిన్న జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో… సీడీఎస్ బిపిన్ రావత్ దంపతులు సహా మొత్తం 13 మంది మరణించిన విషయం విదితమే.. మరణించినవారిలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ భార్య శ్రీమతి మధులికా రావత్, అతని రక్షణ సలహాదారు బ్రిగ్ లఖ్‌బిందర్ సింగ్ లిద్దర్, స్టాఫ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ హర్జిందర్ సింగ్, ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ సిబ్బందితో సహా మరో తొమ్మిది మంది సాయుధ దళాల సిబ్బంది ఉన్నారు. కమాండర్ పృథ్వీ సింగ్ చౌహాన్, స్క్వాడ్రన్ లీడర్ కుల్దీప్ సింగ్, జూనియర్ వారెంట్ ఆఫీసర్ రాణా ప్రతాప్ దాస్, జూనియర్ వారెంట్ ఆఫీసర్ అరక్కల్ ప్రదీప్, హవల్దార్ సత్పాల్ రాయ్, నాయక్ గుర్ సేవక్ సింగ్, నాయక్ జితేంద్ర కుమార్, లాన్స్ నాయక్ వివేక్ కుమార్, లాన్స్ నాయక్ బి సాయి తేజ కన్నుమూశారు.. అందరి పార్థీవ దేహాలను తరలిస్తుండగా.. పూల వర్షం కురిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు ప్రజలు.