ఈశాన్య చైనా లియోనింగ్ ప్రావిన్స్‌లోని షెన్‌యాంగ్‌లో గల రెస్టారెంట్‌లో భారీ పేలుడు సంభవించింది. ఉదయం 8.20 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 33 మందికి తీవ్ర గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు దాదాపు 30 ఫైర్ ఇంజన్లను మోహరించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
అయితే ఈ పేలుడుతో 3 అంతస్థుల రెస్టారెంట్ భవనం కుప్పకూలిపోయింది. అంతేకాకుండా చుట్టుపక్కల పార్క్ చేసిన వాహనాలు సైతం ధ్వంసం అయ్యాయి. దీనితో పాటు సమీపంలో ఉన్న భవనాలు కూడా దెబ్బతిన్నాయి. 33 మంది క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. భవన శిథిలాలను తొలగిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Video: One killed, 33 injured in gas explosion at restaurant in NE China's Shenyang pic.twitter.com/4qFBV5Psc0
— CGTN (@CGTNOfficial) October 21, 2021