Lucknow building collapse: ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నోలో భవనం కుప్పకూలిన ఘటనలో సమాజ్ వాదీ ఎమ్మెల్యే షాహీద్ మంజూర్ కొడుకును పోలీసులు నిన్న అర్థరాత్రి మీరట్ లో అదుపులోకి తీసుకున్నారు. లక్నోలని హజ్రత్ గంజ్ వజీర్ హసన్ రోడ్ లోని అలయా అపార్ట్మెంట్ భవనం కుప్పకూలింది. ఈ భవనం ఎస్పీ ఎమ్మెల్యే కొడుకు నవాజీష్, అతని మేనల్లుడికి చెందినది. సుమారు 12 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ అపార్ట్మెంట్ లో మొత్తం 12 ఫ్లాట్లు ఉన్నాయి. వీటిలో చాలా వరకు ఖాళీగా ఉన్నాయి. అయితే గ్రౌండ్ ఫ్లోర్ లో పనులు జరుగుతున్నాయి.
Read Also: USA: కుక్క ఎంత పనిచేసింది.. తుపాకీతో కాల్చి వ్యక్తిని చంపింది..
కాగా, మంగళవారం అర్థరాత్రి ఈ భవనం ఉన్నపలంగా కుప్పకూలింది. ఈ ప్రమాదంతో ముగ్గురు భవనం శిథిలాల్లో చిక్కుకున్నారు. వీరి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గత 14 గంటల్లో 14 మందిని పోలీసులు, ఫైర్, రెస్క్యూ సిబ్బంది రక్షించారు. కూలిపోవడానికి కారణాలను అణ్వేషించే పనిలో ఉన్నారు అధికారులు. ప్రస్తుతం నవాజీష్ ను మీరట్ నుంచి లక్నోకు తీసుకువస్తున్నారు పోలీసులు. యజ్దాన్ బిల్డర్ నిర్మించిన ఈ భవనాన్ని షాహిద్ మంజూర్ మేనల్లుడు మహ్మద్ తారిఖ్, అతని కుమారుడు నవాజీష్ మంజూర్ 2009లో మార్కెట్ ధర కన్నా రూ. 20 లక్షలకు తక్కువగా కొనుగోలు చేశారు. అప్పటి మార్కెట్ ధర రూ. 3.62 లక్షలుగా ఉంది. కాగా, ఎమ్మెల్యే మంజూర్ కుటుంబం కూడా ఇదే బిల్డింగ్ లో నివసిస్తోంది.