ఇండియా… పాక్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. కాశ్మీర్ అంశం తరువాత రెండు దేశాల మధ్య మరింత దూరం పెరిగింది. కాగా, సుదీర్ఘకాలంగా మూసుకున్న సరిహద్దులు తిరిగి తెరుచుకోబోతున్నాయి. గురునానక్ జయంతోత్సవాల్లో భాగంగా కర్తార్‌పూర్ సాహిబ్ కారిడార్‌ను తిరిగి తెరుస్తున్నారు. ఈనెల 17 వ తేదీన ఈ కారిడార్ ను తెరవబోతున్నట్టు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపిన సంగతి తెలిసిందే. పాక్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని రావి నది ఒడ్డున ఉన్న కర్తార్‌పూర్ సాహిబ్ గురుద్వారా భారత సరిహద్దుకు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నది. కరోనా విలయం కారణంగా 2020 మార్చినెలలో మూసేసిన ఈ కారిడార్‌ను ఈనెల 17 వ తేదీన తెరుస్తున్నారు. నవంబర్ 19 నుంచి గురునానక్ జయంతోత్సవాలు జరగనున్నాయి.
Read: 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబులో ఇప్పటికైనా మార్పు వస్తుందా?