సంపాదనలో టాప్‌లో ఉండడమే కాదు.. సమాజ సేవలో సైతం తాను అంటున్నారు అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీ.. తన తండ్రి 100వ జయంతి, తన 60వ పుట్టినరోజును పురస్కరించుకుని సమాజ సేవలో తన వంతుగా రూ.60 వేల కోట్లు కేటాయించినట్టు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు ఈ ఇండియన్ బిలియనీర్.. మొత్తంగా గౌతమ్ అదానీ, ఆయన కుటుంబం అతని 60వ పుట్టినరోజు సందర్భంగా స్వచ్ఛంద సేవ కోసం రూ. 60,000 కోట్లు కేటాయించింది. ఈ విరాళం ఆరోగ్య సంరక్షణ, విద్య మరియు నైపుణ్యాభివృద్ధి వంటి రంగాల కోసం ఖర్చు చేయనున్నారు.. ఆసియా ధనవంతులలో ఒకరైన గౌతమ్ అదానీ జూన్ 24వ తేదీన పుట్టినరోజును జరుపుకోనున్నారు.. ఈ వ్యాపార దిగ్గజం 60వ జన్మదినాన్ని పురస్కరించుకుని అనేక సామాజిక కార్యక్రమాల కోసం రూ. 60,000 కోట్ల విరాళాన్ని ప్రకటించారు.. ఈ మొత్తాన్ని అదానీ ఫౌండేషన్ ద్వారా ఖర్చు చేయనున్నారు..
Read Also: Narayana: అగ్నిపథ్ స్కీమ్.. కిషన్‌రెడ్డికి నారాయణ కౌంటర్
ఇక, ఈ సంవత్సరం గౌతమ్ అదానీ తండ్రి శాంతిలాల్ అదానీ శత జయంతి కూడా కలిసి రావడంతో.. రేపటితో 60 ఏళ్లు నిండిన భారతీయ వ్యాపారవేత్త.. భారీ మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు ప్రకటించి.. తమ సంపదలో ఎక్కువ భాగాన్ని దాతృత్వానికి అంకితం చేసిన ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ మరియు వారెన్ బఫెట్ వంటి ప్రపంచ బిలియనీర్ల ర్యాంక్‌లో చేరాడు. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితా ప్రకారం అదానీ నికర ఆస్తుల విలువ దాదాపు 95 బిలియన్ డాలర్లుగా ఉంది.. సామాజిక ప్రయోజనాల కోసం విరాళాన్ని ప్రకటించడాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు అదానీ.. “మా నాన్నగారి 100వ జయంతి మరియు నా 60వ పుట్టినరోజు సందర్భంగా, అదానీ కుటుంబం భారతదేశం అంతటా హెల్త్‌కేర్, ఎడ్యుకేషన్ & స్కిల్-డెవలప్‌మెంట్ కోసం రూ. 60,000 కోట్లు కేటాయిస్తుందని పేర్కొన్నారు. ఈ విరాళం ఆరోగ్య సంరక్షణ, విద్య మరియు నైపుణ్యాభివృద్ధి వంటి రంగాలపై దృష్టి సారిస్తుంది, ఇవి ‘ఆత్మనిర్భర్ భారత్’కి పునాది వేస్తాయని.. ఈ అన్ని రంగాలలో సమగ్ర అభివృద్ధి ప్రయత్నాలపై దృష్టి సారించిన కమ్యూనిటీలతో కలిసి పని చేయడంలో అదానీ ఫౌండేషన్ గొప్ప అనుభవాన్ని పొందింది. ఈ సవాళ్లను పరిష్కరించడం ద్వారా మన భవిష్యత్ శ్రామిక శక్తి యొక్క సామర్థ్యాన్ని మరియు పోటీతత్వాన్ని గణనీయంగా పెంచుతుందని తెలిపారు.
On our father’s 100thbirth anniversary & my 60thbirthday, Adani Family is gratified to commit Rs 60,000 cr in charity towards healthcare, edu & skill-dev across India. Contribution to help build an equitable, future-ready India. @AdaniFoundation pic.twitter.com/7elayv3Cvk
— Gautam Adani (@gautam_adani) June 23, 2022