చెరువులు, నదుల్లో చేపల వేట కొందరికి సరదా. మరికొందరికి జీవనోపాధి, చేపల కోసం వలవేస్తే కొందరికి తాబేళ్ళు, పాములు, కప్పలు గట్రా పడుతుంటాయి. ఒడిశాలో చేపల వేటకు వెళ్లిన ఓ మత్స్యకారుడి వలలో పడ్డ దాన్ని చూసి మైండ్ బ్లాంక్ అయింది. కళ్ళు బైర్లు కమ్మాయి. వలలో ఏకంగా ఒక మొసలి చిక్కడమే అందుకు కారణం.
ఇవాళ నా పంట పండిందనుకుని వల పైకి లాగితే సర్రున మొసలి రావడంతో ఆ మత్స్యకారుడు అవాక్కయ్యాడు. వెంటనే అటవీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వాళ్లు దాన్ని తీసుకెళ్లి సురక్షిత స్థావరంలో వదిలేశారు. ఒడిశా రాష్ట్రంలోని తీరప్రాంతం కేంద్రపారలో ఎక్కువమంది చేపలవేటపైనే ఆధారపడుతూ ఉంటారు. ఓ మత్స్యకారుడు చేపల కోసం వల వేయగా ఐదడుగుల పొడవు ఉన్న ఉప్పునీటి మొసలి అతనికి చిక్కింది. దీంతో భయపడిపోయి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించాడు.
ఈ ఉప్పునీటి మొసలి ఆహారం కోసం లూనా నదిలోకి వచ్చిందని భావిస్తున్నారు. ఒడిశాలో ఉప్పునీటి మొసళ్ళ జనాభా భారీగా తగ్గిందట. 40 ఏళ్ళ క్రితం ఒడిశాలో వందలోపే ఈ తరహా మొసళ్ళు కనిపించేవి. ఇప్పుడు వీటి సంఖ్య అనూహ్యంగా పెరిగింది రెండువేల వరకూ వీటి జనాభా వుండివుండవచ్చని అధికారులు చెబుతున్నారు.