పార్లమెంట్ సమావేశాల్లో రైతు చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. రైతు మేలు కోసమే చట్టాలు తీసుకొచ్చామని, రైతులు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి వెనక్కి తీసుకుంటున్నామని కేంద్రం స్పష్టం చేసింది. చట్టాలను వెనక్కి తీసుకున్నాక, రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పోరాటం చేసిన సమయంలో 750 మంది మృతి చెందారు. వీరందరికీ కేంద్రం పరిహారం ఇవ్వాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
Read: ఒమిక్రాన్ కొత్త రూల్స్: ఎయిర్‌పోర్ట్‌లోనే 6 గంటలు…
దీనిపై ఈరోజు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతూ మరణించిన రైతులకు పరిహారం ఇవ్వలేమని పార్లమెంటులో కేంద్రం తేల్చి చెప్పింది. రైతుల మరణాలపై తమ వద్ద ఎలాంటి రికార్డు లేదని కేంద్ర మంత్రి తోమర్ లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. దీంతో సభలో గందరగోళం నెలకొన్నది. మరణించిన రైతులకు పరిహారం ఇచ్చి తీరాల్సిందేనని విపక్షాలు పట్టుబట్టాయి.