భారత్ లో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సమయంలో కరోనా పై పోరుకు బీసీసీఐ భారీ సాయం ప్రకటించింది. ప్రస్తుతం కరోనా పేషేంట్లకు వైద్యం ఇచ్చే సమయంలో ముఖ్యమైన ఆక్సిజన్ కొరత భారీగా ఉంది. దాంతో తమ వంతు సాయంగా 10 లీటర్ల కెపాసిటీ కలిగిన 2 వేల ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను విరాళంగా అందించేందుకు సిద్దమైంది బీసీసీఐ. ‘కరోనా సెకండ్ వేవ్ కారణంగా దేశంలో మెడికల్ ఈక్విప్‌మేంట్, ఆక్సిజన్‌కు తీవ్ర కొరత ఏర్పడింది. ఈ సమస్యను తగ్గించేందుకు బోర్డు తమ వంతుగా ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందజేయనుంది.’అని బీసీసీఐ ట్విట్టర్ వేదికగా తెలిపింది. ఇక కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో బీసీసీఐ 51 కోట్ల విరాళం అందించిన విషయం తెలిసిందే.