కరోనా రక్కసి రూపాలు మార్చుకొని ప్రజలపై విరుచుకుపడుతోంది. ఇప్పటికే పలు దేశాల్లో విజృంభిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. ఇప్పుడు భారత్‌లో కూడా వ్యాప్తి చెందుతోంది. ఇటీవల భారత్‌లోకి ప్రవేశించిన ఒమిక్రాన్ వేరియంట్ తన ప్రభావాన్ని చూపుతోంది. తాజాగా మహారాష్ట్రలో మరో 7 కొత్త ఒమిక్రాన్ కేసులు రావడంతో అధికారులు మరింత పటిష్టంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు.
తాజాగా ఒమిక్రాన్ కేసులతో భారత్‌లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 32 కు చేరుకుంది. రాజస్థాన్‌లో 9, గుజరాత్‌లో 3, కర్ణాటకలో 2, ఢిల్లీలో 1 తో పాటు మహారాష్ట్రలో మొత్తం 17 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అయితే మహారాష్ట్రలో ఒమిక్రాన్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పక్కరాష్ట్రాల ప్రజలు భయాందోళనకు గురిచెందుతున్నారు.