కొత్త ఐటీ నిబంధనలపై ట్విట్టర్ కు ఇప్పటికే పలుమార్లు నోటీసులు జారీ చేసిన కేంద్రం.. తాజాగా మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 18న సాయంత్రం 4 గంటల లోపు పార్లమెంటుకు వచ్చి ఐటీ చట్టం అమలుపై వివరణ ఇవ్వాల్సిందిగా ఆ నోటీసుల్లో పేర్కొంది. పౌరుల భద్రత, ప్రత్యేకించి మహిళా భద్రతపై తీసుకుంటున్న చర్యలపై వివరణ ఇచ్చేందుకు ట్విట్టర్ ప్రతినిధులు శుక్రవారం పార్లమెంటరీ ప్యానెల్ ముందు హాజరుకావాలని ఆదేశించింది. అయితే ట్విట్టర్ ఇదివరకే సానుకూలంగా స్పందించినప్పటికీ మరోసారి నోటీసులు ఇవ్వడంతో కేంద్రం, ట్విట్టర్ మధ్య వివాదం ముదురుతోంది.