కేసీఆర్ సర్కారుపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆగ్రహం

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌ నగరంలోని లుంబిని పార్క్ వద్ద ఉండే పాత సచివాలయాన్ని కూలగొట్టి ప్రతిష్టాత్మకంగా నూతన సచివాలయాన్ని నిర్మిస్తోంది. అయితే సచివాలయం నిర్మాణం విషయంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కొత్తగా నిర్మించే సచివాలయం కోసం పర్యావరణ అనుమతులు తీసుకోకపోవడంపై మండిపడింది. ఈ విషయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ఇప్పటివరకు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడాన్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రశ్నించింది.

Read Also: సింగరేణిలో సమ్మె సైరన్.. ఐదు డిమాండ్లు పరిష్కరించాలని అల్టిమేటం

పర్యావరణ అనుమతులు తీసుకోకుండానే కేసీఆర్ ప్రభుత్వం పాత సచివాలయం కూలగొట్టి కొత్త సచివాలయం నిర్మిస్తోందని గతంలో రేవంత్‌రెడ్డి ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయడంలో తెలంగాణ ప్రభుత్వం జాప్యం చేస్తుండటంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అసహనం వ్యక్తం చేసింది. పర్యావరణ అనుమతులు తీసుకున్నారో లేదో వెంటనే తెలియజేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకోసం మరో మూడు వారాల పాటు గడువు ఇస్తున్నామని.. ఆలోగా తమకు సమాధానం చెప్పాలని ఎన్జీటీ సూచించింది.

Related Articles

Latest Articles