ఆకాశంలో బంగాళ‌దుంప‌ను పోలిన చంద్రుడు… గ్రీకు పురాణాల్లో…

నాసాకు మార్స్ ఆర్బిట‌ర్‌లోని హైరైస్ కెమెరా అంగార‌కుడికి చెందిన చంద్రుని ఫొటోను తీసింది.  ఈ ఫొటోను నాసా ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేయ‌గా ఒక్క‌సారిగా వైర‌ల్‌గా మారింది.  అంగార‌కుడి చంద్ర‌డు ఫోబోస్ చూడ‌టానికి అచ్చంగా బంగాళ‌దుంప‌ను పోలి ఉన్న‌ది.  అంగార‌కుడికి రెండు చంద్రుళ్లు ఉన్నారు.  అందులో అతిపెద్ద‌ది ఈ ఫోబోస్ అని నాసా పేర్కొన్న‌ది.  ఈ ఫొటోను హైరైస్ కెమెరా ఫోబోస్ ఉప‌రిత‌లానికి 6,800 కిలోమీట‌ర్ల ఎత్తు నుంచి తీసింది.  ఇక ఇదిలా ఉంటే అంగార‌కుడికి చెందిన ఫోబోస్ చంద్రుడిని 1877 లో ఆస‌ఫ్ హాల్ అనే ఖ‌గోళ‌శాస్త్ర‌వేత్త క‌నుగోన్నారు.  అయితే, గ్రీకు పౌరాణికాల్లో దీనిని క్షుద్ర‌గ్ర‌హంగా పిలుస్తారు.  ఫోబోస్‌, డీమోస్‌లు క‌వ‌ల‌ల‌ని, వీటిని త‌ల‌చుకుంటే క‌ష్టాలు వ‌స్తాయ‌ని చెబుతుంటారు.  

Read: ఓటిటిలో స్టార్ గా మారిన “పుష్ప” విలన్

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-