గుడ్‌న్యూస్ః ఆ గ్ర‌హంపై జీవుల మ‌నుగ‌డ సాధ్య‌మే… నాసా ప‌రిశోధ‌న‌…

భూమిపై కాకుండా విశ్వంలో మ‌రో గ్ర‌హంపై మాన‌వ మ‌నుగ‌డ సాధ్యం అవుతుందా?  లేదా అనే విష‌యాల‌పై అమెరికాకు చెందిన నాసా సంస్థ అనేక ప‌రిశోధ‌న‌లు చేస్తున్న‌ది.  అయితే, ఈ ప‌రిశోధ‌న‌లో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి.  అంగార‌క గ్ర‌హంపై ఇప్ప‌టికే నాసా పరిశోధ‌న చేస్తున్న‌ది.  సౌర‌కుటుంబంలోని శ‌ని గ్ర‌హానికి చెందిన చంద్రునిపై జీవం ఉండేందుకు అవ‌కాశం ఉన్న‌ట్టుగా నాసా శాస్త్ర‌వేత్త‌లు గుర్తించారు.  

Read: వింబుల్డన్ 2021 ఉమెన్స్ సింగిల్స్లో ప్రియాంక చోప్రా… పిక్స్ వైరల్

శ‌నిగ్ర‌హానికి చెందిన చంద్రుడు ఎన్‌సెలాడ్ పై పెద్ద‌మొత్తంలో మీథేన్ నిల్వ‌లు ఉన్నాయి.  అంతేకాదు ఆ చంద్రునిపై కార్బ‌న్ డైఆక్సైడ్ కూడా ఉన్న‌ట్టు శాస్త‌వేత్త‌లు గుర్తించారు.  కార్బ‌న్‌డైఆక్సైడ్ ను తీసుకొని సూక్ష్మ‌జీవులు మీథేన్‌ను విడుద‌ల చేస్తాయి. మీథేన్ ఉన్న‌ది అంటే అక్క‌డ జీవం ఉంటుంద‌నే నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు నాసా ప‌రిశోధ‌కులు.  ఈ చంద్రుడి ఉప‌రిత‌లం మంచుతో క‌ప్ప‌బ‌డి ఉంద‌ని, ఈ మంచు అడుగున మ‌హాస‌ముద్రం ఉండే అవ‌కాశం లేక‌పోలేద‌ని నాసా ప‌రిశోధ‌కులు చెబుతున్నారు.  

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-