నాసా మరో సాహసం… శుక్ర గ్రహం పై ప్రయోగాలకు సిద్ధం…

నాసా మ‌రో సాహ‌స‌యాత్ర‌కు శ్రీకారం చుట్టింది.  అరుణ‌గ్ర‌హంపై ఇప్ప‌టికే ప‌రిశోధ‌న‌లు చేస్తున్న నాసా ఇప్పుడు దృష్టిని శుక్ర‌గ్ర‌హంమీద‌కు మ‌ళ్లించింది.  శుక్ర‌గ్ర‌హంపైకి రెండు వ్యోమ‌నౌక‌ల‌ను పంపించేందుకు సిద్ద‌మైంది నాసా.  శుక్ర‌గ్ర‌హంమీద ఉష్ణ్రోగ్ర‌తలు తీవ్ర‌స్థాయిలో ఉంటాయి. సీసం సైతం ఆ వేడికి క‌రిగిపోతుంది.  భూమికి స‌మీపంలో ఉన్న శుక్ర‌గ్ర‌హంపై ఆ స్థాయిలో ఉష్ణ్రోగ్ర‌త‌లు ఉండ‌డానికి గ‌ల కార‌ణాలు ఏంటో తెలుసుకునేందుకు నాసా ప్ర‌యోగాలు చేయ‌బోతున్న‌ది.  ఈ వేడి గురించి తెలుసుకోవ‌డానికి నాసా రెండు వ్యోమ‌నౌక‌ల‌ను సిద్దం చేస్తున్న‌ది.  డావించి, వెరిటాన్ పేరుతో ఈ నౌక‌లు సిద్దం అవుతున్నాయి.  డావించి శుక్ర‌గ్రహంపై ఉండే వాతావ‌ర‌ణంపై ప‌రిశోధ‌న‌లు చేసేవిధంగా, వెరిటాన్ ను శుక్ర‌గ్ర‌హాన్ని మ్యాపింగ్ చేసేందుకు అనువుగా త‌యారుచేస్తున్నారు.  వీటిని 2028 లేదా 2030లో ప్ర‌యోగించే అవ‌కాశం ఉన్న‌ది.  

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-