సాయి తేజ్ ఆక్సిడెంట్ పై నరేష్ క్లియర్ క్లారిఫికేషన్

టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ బైక్ ఆక్సిడెంట్ కు గురికావడంతో పలువురు సినీప్రముఖులు స్పందిస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. కాగా, మరోసారి సీనియర్ నటుడు నరేష్ సాయి తేజ్ ప్రమాదంపై స్పందించారు. ‘నేను ఎలాంటి రాజకీయాలు చేయడం లేదు.. ఇది రాజకీయాలు చేయాల్సిన సమయం కూడా కాదు.. చిరంజీవి మేము కుటుంబ సభ్యులంతా కలిసే మద్రాస్ లో ఉన్నాము.. మా రెండు కుటుంబాల మధ్య చాలా ఆత్మీయ బంధం ఉందన్నారు.

Read Also: ఈ టైమ్‌లో నరేష్ అట్లా మాట్లాడం కరెక్ట్ కాదు: బండ్ల గణేష్

నరేష్ మాట్లాడుతూ.. ‘నవీన్, సాయి ధర్మ తేజూలు మంచి మిత్రులు.. ఇద్దరు కలిసి బైక్ మీద వెళ్లారు అనేది నేను చెప్పింది వాస్తవం.. ఇద్దరు కలిసి ఒక చాయ్ షాప్ ఓపెనింగ్ చేశారు.. చాయ్ షాప్ ఓపెన్ చేసిన తర్వాత ఎవరు వాళ్ళు వెళ్తున్నారు.. ఈ సమయంలోనే సాయి తేజ రోడ్డు బైక్ రోడ్డు ప్రమాదానికి గురైంది. నవీన్, సాయితేజ ఇద్దరు కూడా మంచి బైక్ రైడర్స్.. ఇద్దరు కూడా పూర్తిస్థాయి సెక్యూరిటీతో బైక్స్ నడుపుతారు. ఇద్దరికీ ఎప్పుడూ కూడా రోడ్డు ప్రమాదం కాలేదు… ప్రస్తుతం జరిగిన ప్రమాదం ఇసుకతోనే జరిగిన తప్పిదం.. మానవ తప్పిదం కానే కాదు.. తేజూ డ్రైవింగ్ ను తప్పుపట్టాల్సిన అవసరం లేదు. బైక్ కూడా పెద్దగా స్పీడ్ లేదు.. మీడియాలో వస్తున్నా విజువల్స్ కూడా చూడొచ్చు.

Read Also: సాయి తేజ్ ఆరోగ్యంపై తాజా హెల్త్ బులెటెన్ విడుదల

నరేష్ మాట్లాడుతూ.. సాయి తేజకు రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే నేను కొంత ఆందోళన గురయ్యాను. ఈ సందర్భంలోనే ఈ బైక్స్ ఎవరు వాడొద్దని రిక్వెస్ట్ చేశాను.. నా కొడుకుతో పాటు సాయి తేజకు బైక్స్ వద్దంటూ పలుమార్లు చెప్పాను. వాళ్ళిద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం కూడా చేశాను.. నేను రోడ్డు ప్రమాదానికి గురై మూడు నెలలు ఆసుపత్రిలో ఉన్నాను.. ఈ నేపథ్యంలోనే తాను బైక్స్ నేను వద్దంటూ నిర్ణయం తీసుకున్నాను. సాయి తేజ ఆక్సిడెంట్ పై నేను కాంట్రవర్సీ చేయడం లేదు.. రాజకీయం అసలు మాట్లాడటం లేదు. సాయి తేజ కోరుకొని ఇంటికి వచ్చాక కలుస్తాను. చిరంజీవి నాగబాబుతో కంటిన్యూగా మాట్లాడుతూనే ఉన్నాను’ అంటూ నరేష్ మరో వీడియో ద్వారా తెలియచేశారు.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-