నరేంద్రగిరి మృతిపై విచారణ వేగవంతం.. వెలుగులోకి కీలక అంశాలు..!

అఖిల భారతీయ అఖాడా పరిషత్‌ అధ్యక్షుడు మహంత్‌ నరేంద్రగిరి… అనుమానాస్పద మృతిపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. అలహాబాద్‌లోని బాఘంబరి మఠంలోని అతిథి గృహంలో పైకప్పునకు వేలాడుతూ ఆయన మృతదేహం కనపడినట్లు పోలీసులు వెల్లడించారు. తొలుత ఆయన మృతిని పోలీసులు ఆత్మహత్యగా భావించి… కేసు నమోదు చేశారు. అయితే, గదిలో లభించిన ఆత్మహత్య లేఖను స్వాధీనం చేసుకున్నారు. మానసికంగా తీవ్ర కలతకు గురైన తాను జీవితాన్ని ముగిస్తున్నట్లు అందులో రాసి ఉందని తెలిపారు.

ఆశ్రమంలోని శిష్యులను పోలీసులు విచారించడంతో… పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. నరేంద్ర గిరికి అత్యంత నమ్మకస్తుడిగా ఉండే ఆనంద్‌ గిరి అనే శిష్యుడు.. గతంలో ఆశ్రమంలో మోసాలకు పాల్పడ్డాడు. దీంతో అతడ్ని అక్కడి నుంచి బయటకు పంపించేశారు. అయితే కొన్ని రోజుల తర్వాత ఆనంద్ గిరి మళ్లీ నరేంద్ర వద్దకు వచ్చి క్షమించమని కోరడంతో… తిరిగి ఆశ్రమంలో చేర్చుకున్నట్లు తెలిసింది. నరేంద్ర గిరిని… ఆనంద్‌ పలుమార్లు వేధించినట్లు కొందరు పోలీసులకు తెలిపారు. ఆయన మరణించిన గది ముందు సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించారు పోలీసులు. వీటి ఆధారంగా ఆనంద్‌ను పోలీసులు అరెస్టు చేసి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. మరోవైపు, నరేంద్ర గిరిని హత్య చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆయన మృతిపై స్వతంత్ర కమిటీతో దర్యాప్తు జరిపించాలంటూ అలహాబాద్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. మరోవైపు.. రేపు నరేంద్ర గిరి మృతదేహానికి పోస్టుమార్టం కూడా నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నారు.. నిందితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ప్రకటించారు.

-Advertisement-నరేంద్రగిరి మృతిపై విచారణ వేగవంతం.. వెలుగులోకి కీలక అంశాలు..!

Related Articles

Latest Articles