‘నారప్ప’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

విక్టరీ వెంకటేశ్, ప్రియమణి జంటగా తెరకెక్కిన ‘నారప్ప’ చిత్రం విడుదల విషయంలో క్లారిటీ వచ్చేసింది. ముందు అనుకున్న విధంగానే ‘నారప్ప’ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయబోతున్నారు నిర్మాత సురేశ్ బాబు, కలైపులి ఎస్. థాను. ఈ రోజు సాయంత్రం దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన సైతం పోస్టర్ రూపంలో వచ్చేసింది. జూలై 20న ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. అక్టోబర్ నెలాఖరు వరకూ సినిమాలను ఓటీటీలో విడుదల చేయొద్దని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యవర్గం చేసిన తీర్మానాన్ని పట్టించుకోకుండానే సురేశ్ బాబు ‘నారప్ప’ ను ఓటీటీలో విడుదల చేస్తుండటం విశేషం.

Read also : తల అజిత్ “వాలిమై” ఫస్ట్ లుక్ స్టిల్స్

అయితే… తన చిత్రాలకు సంబంధించిన అగ్రిమెంట్ ఆ తీర్మానం చేయడానికి ముందే జరిగిందన్నది సురేశ్ బాబు వాదనగా కనిపిస్తోంది. నిన్న మణిశర్మ పుట్టిన రోజు సందర్భంగా ‘నారప్ప’లోని ఓ పాటను విడుదల చేశారు. దానికి మంచి అప్లాజ్ వచ్చింది. అదే వేడిలో ఈ రోజు సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ‘నారప్ప’ విషయంలోనే కాకుండా తోటి నిర్మాతలతో కలిసి సురేశ్ బాబు నిర్మిస్తున్న ‘విరాట పర్వం’, ‘దృశ్యం -2’ చిత్రాలు సైతం ఓటీటీ బాట పట్టడం ఖాయంగా తెలుస్తోంది. మరి ఆ సినిమాల స్ట్రీమింగ్ తేదీలను ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-