“నారప్ప” నుంచి “చలాకీ చిన్నమ్మి” వచ్చేసింది!

విక్టరీ వెంకటేష్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో ఈ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ఆక్షన్ ఎంటర్టైనర్ “నారప్ప”. సురేష్ బాబు, కలైపులి ఎస్ థాను నిర్మాతలుగ వ్యవహరిస్తున్నారు. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ధనుష్ చిత్రం “అసురన్” రీమేక్ గా “నారప్ప” తెరకెక్కుతోంది. తాజాగా ఈ చిత్రం నుంచి “చలాకీ చిన్నమ్మి” అనే సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. మణిశర్మ పుట్టినరోజు సందర్భంగా నేడు ఆయన సంగీత దర్శకత్వం వహిస్తున్న “నారప్ప” నుంచి మొదటి సాంగ్ ను రిలీజ్ చేశారు.

Read Also : కత్తి మహేష్ మృతికి టాలీవుడ్ ప్రముఖుల సంతాపం

వెంకీ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ సాంగ్ ను యంగ్ ప్లేబ్యాక్ సింగర్స్ నూతన మోహన్, ఆదిత్య అయ్యంగార్ అద్భుతంగా ఆలపించారు. ప్రముఖ గీత రచయిత అనంత శ్రీరామ్ అందించిన సాహిత్యం బాగుంది. ఈ సాంగ్ తో మణిశర్మ మరోసారి అందరి మనసులను దోచేశారు. కాగా ఈ సినిమా ఓటిటిలో విడుదల కానుంది. త్వరలో సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు. మీరు కూడా “చలాకీ చిన్నమ్మి” సాంగ్ ను ఓసారి వీక్షించండి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-