వైసీపీ పాల‌న‌లో హ‌త్య‌లు, దోపిడీలు, అరాచ‌కాలే ఎక్కువ : లోకేష్

ఏపీ సర్కార్ పై టిడిపి నేత నారా లోకేష్ మరోసారి ఫైర్ అయ్యారు. అధికారం అండ‌తో వైసీపీ పార్టీ హ‌త్యారాజ‌కీయాల‌కు పాల్ప‌డుతోందని మండిపడ్డారు. అనంత‌పురం జిల్లా రాయదుర్గం మండలం మలకాపురం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త గోపాల్ ను వైసీపీ నేత‌లు పాశ‌వికంగా హ‌త్య చేశారని లోకేష్ సంచలన ఆరోపణలు చేశారు. టిడిపి ప్రభుత్వం హ‌యాంలో రాష్ట్ర‌మంతా అభివృద్ధి-సంక్షేమం క‌నిపించేద‌ని.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. వైసీపీ రెండేళ్ల పాల‌న‌లో హ‌త్య‌లు, దోపిడీలు, అరాచ‌కాలే క‌నిపిస్తోన్నాయని ఫైర్ అయ్యారు. ప్ర‌శాంతంగా ఉన్న రాష్ట్రాన్ని హ‌త్యారాజ‌కీయాల‌కు కేంద్రంగా మార్చేశారని వైసీపీ సర్కార్ పై మండిపడ్డారు. టిడిపి కార్య‌క‌ర్త గోపాల్‌ ని హ‌త్య‌చేసిన వారిని, హంత‌కుల‌కు మ‌ద్ద‌తుగా నిలిచిన వారిని క‌ఠినంగా శిక్షించాలని లోకేష్ డిమాండ్ చేశారు. గోపాల్ కుటుంబానికి టిడిపి పార్టీ అన్నివిధాలా అండ‌గా ఉంటుందని హామీ ఇచ్చారు లోకేష్.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-