క‌బ‌డ్డీ పేరుతో క‌బ్జాలు : విజయసాయిరెడ్డిపై లోకేష్ ఫైర్

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టిడిపి నేత నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ‌ప‌ట్ట‌ణం.. అన‌ధికారికంగా విజయసాయిరెడ్డి ప‌ట్ట‌ణ‌మైపోయిందని..క‌న్నుప‌డితే క‌బ్జా చేస్తున్నారని మండిపడ్డారు. క‌బ‌డ్డీ పేరుతో క‌బ్జా చేయాల‌ని చూశారని ఫైర్ అయ్యారు. “విశాఖ‌ప‌ట్ట‌ణం.. అన‌ధికారికంగా ఎంపి విజయసాయిరెడ్డి ప‌ట్ట‌ణ‌మైపోయింది. క‌న్నుప‌డితే క‌బ్జా, ఖాళీ చేయ‌క‌పోతే జేసీబీల‌తో విధ్వంసం. పెద‌వాల్తేరులోని 190 మంది వివిధ ర‌కాల మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో ఉన్న పిల్ల‌ల‌కు విద్యాబుద్ధులు నేర్పుతోన్న హిడెన్ స్ప్రౌట్స్ పాఠ‌శాల‌ని..ఏ2 రెడ్డి గ్యాంగులు క‌బ‌డ్డీ పేరుతో క‌బ్జా చేయాల‌ని చూశారు. సాధ్యం కాక‌పోయే స‌రికి రాజారెడ్డి రాజ్యాంగానికి అనువైన శ‌నివారం రోజు జేసీబీల‌తో కూల్చేశారు. మాన‌సిక దివ్యాంగులకు నీడ‌నిచ్చే పాఠ‌శాల‌కు సాయం చేయాల్సింది పోయి,ఆక్ర‌మించిన వైకాపా నాయకుల పాపాలు పండే రోజు ద‌గ్గ‌ర ప‌డింది” అంటూ ఫైర్ అయ్యారు లోకేష్.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-