పెట్రోల్ ధ‌ర‌లపై లోకేష్ ఫైర్.. ఇది జ‌గ‌న్ రెడ్డి పాపమే..!

పెట్రోల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వంపై టిడిపి నేత నారా లోకేష్ మరోసారి నిప్పులు చెరిగారు. విధ్వంసం-విద్వేషం రెండుక‌ళ్లుగా సాగుతున్న జగన్ రెండేళ్ల పాల‌న‌లో ధ‌ర‌లు రెండింత‌లు పెరిగాయని ఫైర్ అయ్యారు. ప్ర‌భుత్వ ట్యాక్స్‌ల‌కు అద‌నంగా జ‌గ‌న్ ట్యాక్స్ తోడ‌వ‌డంతో అన్ని రేట్లూ పెరిగాయని చురకలు అంటించారు. బాదుడురెడ్డి దెబ్బ‌కి పెట్రోల్ ధ‌ర‌ శుక్ర‌వారం ద‌క్షిణాది రాష్ట్రాల‌లో సెంచ‌రీ దాటి (రూ.101.61) నాట‌వుట్‌గా రికార్డులు సృష్టించిందని మండిపడ్డారు లోకేష్. పెట్రోల్ ధ‌ర‌ల పెంపులో సౌత్‌లో ఏపీని నెంబ‌ర్‌వ‌న్‌గా నిలిపారని.. ఇది జ‌గ‌న్ రెడ్డి పాపమేనని.. అది ప్ర‌జ‌ల‌కు శాపంగా మారిందని ఫైర్ అయ్యారు. అభివృద్ధిలో ఏపీ అట్ట‌డుగు స్థానమని, కోవిడ్ కేసుల్లో 5వ స్థానానికి ఏపీని జగన్ చేర్చారని పేర్కొన్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-