వరదలతో ప్రజలు అల్లాడుతుంటే.. జగన్ పెళ్లిళ్లకు వెళ్లడమేంటి?: లోకేష్

తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి మనవరాలి వివాహం ఆదివారం నాడు హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్, కేసీఆర్ ఇద్దరూ ముచ్చటించుకున్నారు. అయితే ఏపీలో ఓ పక్క వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సీఎం జగన్ పెళ్లికి హాజరుకావడంపై టీడీపీ నేత లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమలో వరదలు బీభత్సం సృష్టిస్తుంటే సీఎం జగన్ పెళ్లికి హాజరుఉ కావడమేంటని లోకేష్ ప్రశ్నించారు.

Read Also: ఎల్లుండి నుంచి వరద ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన

‘దీన్ని నమ్మలేకపోతున్నా.. రాయలసీమ, నెల్లూరు జిల్లాలు వరదలకు అతలాకుతలమై, ఎంతో మంది ప్రాణాలు పోతుంటే మన గౌరవ ముఖ్యమంత్రి వాళ్లను ఆదుకునేది పోయి.. పెళ్లిళ్లకు వెళ్తున్నారు. రాయలసీమను కాపాడండి’ అంటూ లోకేష్ ట్వీట్ చేశారు. అంతేకాకుండా జగన్, కేసీఆర్ వధూవరులతో దిగిన ఫోటోను కూడా లోకేష్ షేర్ చేశారు. మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ అధినేత మంగళవారం నుంచి పర్యటించనున్నారు. ఇప్పటికే వరద బాధితులకు ఆహారం, మందులు అందించాలని టీడీపీ శ్రేణులకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.

Related Articles

Latest Articles