సీఎం జగన్ పై నారా లోకేష్ ఫైర్…తుగ్లక్ 3.0 అంటూ !

అమరావతి : మూడు రాజధానుల పై సీఎం జగన్‌ చేసిన వ్యాక్యలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కౌంటర్‌ ఇచ్చారు. సీఎం జగన్‌ తుగ్లక్ 3.0 అని… మూర్ఖుడు మారాలని కోరుకోవడం అత్యాశే అంటూ ఫైర్‌ అయ్యారు. అసెంబ్లీని అసత్య వేదికగా మార్చేశారని.. నిప్పులు చెరిగారు. ఇల్లు ఇక్కడే కట్టా, అమరావతే రాజధాని అంటూ ఎన్నికలకు వెళ్లిన వ్యక్తి మూడు రాజధానుల కోసం ప్రజలు తీర్పు ఇచ్చారనడం హైలైట్ అంటూ ఎద్దేవా చేశారు నారా లోకేష్‌. మురుగు బుర్రలకి మెరుగైన ఆలోచనలు రావడం ఎప్పటికీ జరగని పని అంటూ చురకలు అంటించారు. మాట మార్చడం ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డికి అలవాటై పోయిందని నిప్పులు చెరిగారు నారా లోకేష్‌.

Related Articles

Latest Articles