పండగపూట విషాదం.. ప్రముఖ నటికి యాక్సిడెంట్.. కూతురు మృతి

సంక్రాంతి పండగపూట కన్నడ చిత్రపరిశ్రమలో విషాదం చోటుచేసుకొంది. ప్రముఖ కన్నడ టీవీ నటి అమృతా నాయుడు రోడ్డుప్రమాదానికి గురయ్యారు. బెంగుళూరులో గురువారం రాత్రి ఆమె తన 6 ఏళ్ల కూతురు సమన్వితో కలిసి స్కూటీ మీద వెళ్తుండగా పెద్ద లారీ ఆమె బండిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నారి సమన్వి అక్కడిక్కడే మృతిచెందగా.. అమృతకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం దగ్గర్లోని హాస్పిటల్ కి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలుపుతున్నారు. ఇంకా బాధాకరమైన విషయమేంటంటే.. అమృత ప్రస్తుతం నాలుగు నెలల గర్భిణీ. ఈ రోడ్డు ప్రమాదంలో ఆమె తన గర్భాన్ని కూడా పోగొట్టుకున్నారు.

ఇకపోతే అమృతా నాయుడు పలు టీవీ సీరియల్లో నటించి మెప్పించగా సమన్వి కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకోంది. నానమ్మ సూపర్ స్టార్ రియాలిటీ షో లో సమన్వి పాల్గొని మంచి పేరు తెచ్చుకొంది. భవిష్యత్తులో ఆమె గొప్ప నటి అవుతుందని అందరు భావించారు. కానీ, ఇలా హఠాత్మరణంతో చిన్నారి సమన్వి ప్రాణాలు విడవడం బాధాకరంగా ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వరః కన్నడ పరిశ్రమను విషాదంలోకినెట్టింది.

Related Articles

Latest Articles