బెంగాలీలో ‘బాజీ’గా రీమేక్ అయిన ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’

2016 లో ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘నాన్నకు ప్రేమతో’. రివెంజ్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల మన్ననలు కూడా అందుకుంది. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించగా జగపతి బాబు విలన్ గా రాజేంద్రప్రసాద్ ఎన్టీఆర్ తండ్రిగా నటించారు. మ్యూజికల్ గానూ హిట్ అయిన ఈ సినిమా 5 సంవత్సరాల తరువాత ఇప్పుడు బెంగాలీలో రీమేక్ చేశారు. బెంగాలీ హీరో జీత్, మిమి చక్రవర్తి జంటగా ‘బాజీ’ పేరుతో రూపొందిన ఈ చిత్రానికి అన్షుమన్ ప్రత్యూష్ దర్శకత్వం వహించారు. మేలో విడుదల కావలసిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. దసరా కానుకగా అక్టోబర్ 10 న ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. హీరో జీత్ కూడా ఓ నిర్మాత కావటం విశేషం.

Read Also : లండన్‌లో సిద్ధార్థ్… సీక్రెట్ గా సర్జరీనా?

-Advertisement-బెంగాలీలో 'బాజీ'గా రీమేక్ అయిన ఎన్టీఆర్ 'నాన్నకు ప్రేమతో'

Related Articles

Latest Articles