థియేటర్లలోనే “టక్ జగదీష్”

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘టక్ జగదీష్’. ఈ చిత్రంలో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. జగపతిబాబు, ఐశ్వర్యా రాజేశ్, నాజర్, రోహిణి, దేవదర్శిని, నరేశ్, రావు రమేశ్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ‘నిన్నుకొరి’ తరువాత శివ నిర్వాణ, నాని కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది ఈ సినిమాను నిర్మించారు. ‘టక్ జగదీష్’కు థమన్ సంగీతం అందించారు. ఏప్రిల్ 23న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే కరోనా మహమ్మారి ఎఫెక్ట్ పెరుగుతుండడంతో కొంతమంది మేకర్స్ తమ సినిమాలను ఓటిటి వేదికగా విడుదల చేస్తున్నారు. ఇప్పుడు “టక్ జగదీష్” టీం కూడా అదే బాటలో నడుస్తుందనే రూమర్ జోరందుకుంది. ఇప్పటికే ప్రముఖ ఓటిటి సంస్థతో “టక్ జగదీష్” సంప్రదింపులు జరిగాయని, డీల్ ఓకే అయ్యిందని, త్వరలోనే ఓటిటిలో ఈ చిత్రం విడుదల అవుతుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ‘టక్ జగదీష్’పై సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు. రూమర్లను నమ్మొద్దని, ‘టక్ జగదీష్’ థియేటర్లలో మాత్రమే విడుదల అవుతుందని వెల్లడించారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-