‘మిస్టర్ ప్రెగ్నెంట్’ గ్లింప్స్: కడుపుతో ఉన్నానంటున్న సోహెల్

బిగ్ బాస్ తెలుగు 4 కంటెస్టెంట్ సయ్యద్ సోహెల్ హీరోగా ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ చిత్రం తెరకెక్కుతోంది.. పురుషుడు గర్భం దాలిస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయనే వినూత్నమైన కథతో వస్తున్న ఈ చిత్ర గ్లింప్స్ ను తాజాగా హీరో నాని విడుదల చేశారు.. ‘ఈ టైమ్ లో ఫైట్ ఏంట్రా..? కడుపుతో వున్నానని చెప్పుతున్నానుగా..’ అంటూ సోహెల్ చెప్పే డైలాగ్స్ మరింత ఆసక్తికరంగా వున్నాయి.

ఈ చిత్రంతో వింజనపాటి శ్రీనివాస్ దర్శకునిగా పరిచయం అవుతుండగా.. మైక్ టీవీ పతాకంపై అప్పిరెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రూపా కొడవాయుర్ హీరోయిన్‌గా నటిస్తోంది. సుహాసిని, బ్రహ్మాజి, అలీ, హర్ష తదితర పాత్రల్లో నటిస్తున్నారు. ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సినిమా టాలీవుడ్ లో ఓ కొత్త వినోదాత్మక, ప్రేమకథా చిత్రంగానే కాకుండా చక్కని ప్రయోగాత్మక సినిమా అవుతుందని చిత్రబృందం భావిస్తోంది.

Related Articles

Latest Articles

-Advertisement-