“తిమ్మరుసు” వేడుకకు అతిథిగా నేచురల్ స్టార్

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ హీరోగా నటిస్తున్న క్రైమ్ కోర్ట్ థ్రిల్లర్ “తిమ్మరుసు”. శరన్ కొప్పిశెట్టి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ తరువాత థియేటర్లలో రిలీజ్ కావడానికి సిద్ధమైన మొట్టమొదటి సినిమా ఇదే. నిన్న విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. టాలీవుడ్ స్టార్స్ అంతా సినిమా ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. ఎన్టీఆర్ చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ అవ్వగా, నేడు నేచురల్ స్టార్ నాని “తిమ్మరుసు”కు ప్రమోషన్లకు అతిథిగా విచ్చేయనున్నారు.

Read Also : రాజ్ కుంద్రా కేసులో వెలుగులోకి మరో ట్విస్ట్… !

ఈరోజు సాయంత్రం 7 గంటలకు జరగనున్న “తిమ్మరుసు” ప్రీ రిలీజ్ ఈవెంట్ కు నాని అతిథిగా హాజరుకాబోతున్నట్టు తెలియజేస్తూ మేకర్స్ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయినట్టు సమాచారం. జూలై 30న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో అనే ఆసక్తి టాలీవుడ్ లో నెలకొంది.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-