కొత్త సెల్ఫీతో నాని కొత్త కోరిక…!

నేచురల్ స్టార్ నాని ‘వి’ చిత్రంతో చివరిసారిగా ప్రేక్షకులను పలకరించాడు. ఆ తరువాత ఆయన వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. కరోనా కారణంగా నాని నటించిన చిత్రాల విడుదల వాయిదా పడింది. ఈ ఏడాది ఏప్రిల్ 23న విడుదల కావాల్సిన “టక్ జగదీష్” కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. ఈ చిత్రం ఒటిటి ప్లాట్‌ఫామ్‌లో విడుదల అవుతుందనే ఊహాగానాలు రాగా… మేకర్స్ వాటిని కొట్టుపారేశారు. థియేటర్ లోనే ఈ సినిమా విడుదల ఉంటుందని ధృవీకరించారు. శివ నిర్వాణ దర్శకత్వం-నాని కాంబినేషన్ లో వస్తున్న రెండవ చిత్రమిది. ఈ చిత్రాన్ని సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు. ప్రస్తుతం నాని “శ్యామ్ సింగ రాయ్” చిత్రం చిత్రీకరణతో బిజీగా ఉన్నారు. సాయి పల్లవి, కృతి శెట్టిలు కథానాయికలుగా నటించిన ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. కరోనా కారణంగానే ఈ చిత్రం షూటింగ్ కూడా వాయిదా పడింది. ఇక మరో చిత్రం “అంటే సుందరానికి” అనే చిత్రం కూడా నాని ఖాతాలో ఉంది. ఈ చిత్రంతో నజ్రియా నజీమ్ టాలీవుడ్‌లోకి అడుగు పెట్టనుంది.ఈ నేపథ్యంలోనే ఈరోజు కొత్త సెల్ఫీని పోస్ట్ చేయడంతో పాటు కొత్త కోరికను కూడా కోరుకున్నారు నాని. ఇన్‌స్టాగ్రామ్‌ లో సెల్ఫీని షేర్ చేసుకున్న నాని ఈ జూన్ బాగుండాలని కోరుకున్నాడు.

View this post on Instagram

A post shared by Nani (@nameisnani)

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-