నీకు ప్రాబ్లెమ్ అయితే ఎల్లిపోతా మామ… “జాతిరత్నం”కు నాని పంచ్

కమెడియన్ రాహుల్ రామకృష్ణకు నేచురల్ స్టార్ నాని పాపులర్ “జాతిరత్నం” డైలాగ్ తో పంచ్ వేశాడు. “నీకు ప్రాబ్లెమ్ అయితే ఎల్లిపోతా మామ…” అంటూ రాహుల్ రామకృష్ణ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ కు స్పందిస్తూ కామెంట్ చేశారు. గత కొన్ని రోజులుగా తన సినిమాను ప్రమోట్ చేసుకోవడంలో భాగంగా వివాదాస్పద ట్వీట్లతో వార్తల్లో నిలుస్తున్న రాహుల్ రామకృష్ణ తాజాగా నానిని ట్యాగ్ చేస్తూ తాను నానికి బిగ్ బిగ్ ఫ్యాన్ అని, అయినప్పటికీ ఆయన సినిమా కంటే సెప్టెంబర్ 10న విడుదల కానున్న తన సినిమానే బెస్ట్ అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ కు స్పందిస్తూ నాని పై విధంగా స్పందించాడు.

Read Also : ఏడాది పూర్తి చేసుకున్న నాని “వి”

నూతన దర్శకుడు భార్ఘవ్ మాచర్ల దర్శకత్వంలో వస్తున్న వెబ్ మూవీ “నెట్”. రాహుల్ రామకృష్ణ, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ సెప్టెంబర్ 10న వినాయక చవితి సందర్భంగా జి ఫైవ్ యాప్ లో విడుదల కాబోతుంది. అయితే అదే రోజున నాని “టక్ జగదీష్”, నాగ చైతన్య “లవ్ స్టోరీ” సినిమాలు కూడా విడుదలకు ముహూర్తం ఖరారు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో “నా సినిమాలో దమ్ముంది” అంటూ రాహుల్ రామకృష్ణ చేసిన ట్వీట్ టాలీవుడ్ లో రచ్చ చేసింది. ఆ తరువాత విమర్శలకు సమాధానంగా ఇక్కడ అందరూ పత్తిత్తులు అంటూ సెటైర్లు వేసిన రామకృష్ణ తాజాగా “నెట్ ని అత్యంత అంకితభావంతో పని చేసే సిబ్బంది, కష్టపడి పని చేసే చిత్ర నిర్మాతలు తెరకెక్కించారు. కమర్షియల్ సినిమాలు చెప్పే మిగిలిన వారిలా కాకుండా ఒక కథ చెప్పే ధైర్యం ఉంది. మాకు మద్దతు ఇవ్వండి! మంచి సినిమా ఎదగడానికి సహాయపడండి!” అంటూ ట్వీట్ చేశారు. మొత్తానికి రాహుల్ రామకృష్ణ ఇలా ట్వీట్లతోనే ఈ సినిమాకు కావాల్సినంత ప్రచారం చేస్తున్నాడు.

Related Articles

Latest Articles

-Advertisement-