‘ఎంసిఏ’ సెంటిమెంట్ ను ఫాలో అవుతున్న నాని

నేచురల్ స్టార్ నాని కెరీర్లో గుర్తిండిపోయే చిత్రాల్లో ‘ఎంసిఏ’ ఒకటి. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో నాని మిడిల్ క్లాస్ అబ్బాయిగా అదరగొట్టేశాడు. సినిమాలో నాని, సాయి పల్లవి ఆన్ స్క్రీన్ రొమాన్స్ కు, అలాగే పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. అయితే ఇప్పుడు నాని మరోసారి ఈ సినిమా సెంటిమెంట్ లనే ఫాలో అవుతున్నాడు. నాని తాజా చిత్రం ‘శ్యామ్ సింగ రాయ్’ డిసెంబర్ 24న విడుదలకు సిద్ధంగా ఉంది. సెప్టెంబర్ 18న ఉదయం ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను మరింతగా పెంచేసింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే నాని, సాయి పల్లవి కాంబోలో వస్తున్న రెండవ చిత్రం ఇది. వీరిద్దరి పెయిర్ కు మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. ఇక మరో విషయం ఏమిటంటే ‘శ్యామ్ సింగ రాయ్’ విడుదల తేదీ.

Read Also : ‘పుష్ప’రాజ్ ని ఢీ కొట్టబోతున్న హాలీవుడ్ స్టార్

‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రం డిసెంబర్ 24న అంటే క్రిస్మస్ కానుకగా రాబోతోంది. ‘ఎంసిఏ’ చిత్రం కూడా 2017 డిసెంబర్ 21న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అంటే ఇప్పుడు నాని ‘ఎంసిఏ’కు సంబంధించి హీరోయిన్, విడుదల తేదీ అనే రెండు సెంటిమెట్లను గట్టిగా నమ్ముతున్నాడు. తాజాగా జరిగిన ‘శ్యామ్ సింగ రాయ్’ ప్రెస్ మీట్ లో కూడా నాని ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ‘ఎంసిఏ’లాగే ‘శ్యామ్ సింగ రాయ్’కి కూడా క్రిస్మస్ కలిసి వస్తుందనే ఆశా భావాన్ని వ్యక్తం చేశారు. అయితే క్రిస్మస్ బరిలో నానికి పోటీగా ‘గని’ సిద్ధమని ఇటీవలే ప్రకటించారు. ఇక నందమూరి కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ సైతం అదే రోజు రిలీజ్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు డిసెంబర్ 17న ‘పుష్ప’రాజ్ థియేటర్లను ఆక్రమించుకోనున్నాడు. మరి నాని సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా ? అనేది చూడాలి.

Related Articles

Latest Articles