నాని విలనీ ప్రదర్శిస్తాడా?

టాలీవుడ్ యంగ్ హీరోల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుల్లో నేచురల్ స్టార్ నాని ఒకరు. అయితే మిడిల్ క్లాస్ అబ్బాయి తర్వాత ఆ రేంజ్ హిట్ అందుకోలేక పోయాడు నాని. ‘జెర్సీ’తో నటుడుగా విమర్శకుల ప్రశంసలు పొందినా… కమర్షియల్ గా అనుకున్న రేంజ్ లో సక్సెస్ కొట్టలేక పోయాడు. ఆ తర్వాత వచ్చిన ‘గ్యాంగ్ లీడర్’, ‘వి’, ‘టక్ జగదీశ్’ వరుసగా నిరాశ పరిచాయి. మధ్యలో నిర్మాతగా ‘హిట్’తో విజయం సాధించినా నటుడుగా మాత్రం సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు. త్వరలో ‘శ్యామ్ సింగ్ రాయ్’గా ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. అలాగే ‘అంటే సుందరానికి’ సినిమా కూడా షూటింగ్ లో ఉంది. ఇదిలా ఉంటే నాని విలన్ గా చేయబోతున్నాడనే టాక్ ప్రచారంలో ఉంది.

ఇటీవల ‘మాస్టర్’ తో హిట్ కొట్టిన తమిళ హీరో విజయ్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో విలన్ పాత్రకు చక్కటి గుర్తింపు ఉంటుందట. ‘మాస్టర్’లో కూడా విలన్ గా నటించిన విజయ్ సేతుపతికి మంచి పేరు వచ్చింది. అలాగే ఇప్పుడు ఈ సినిమాలో పవర్ ఫుల్ విలన్ రోల్ ఉందట. దాని కోసం నానిని సంప్రదించినట్లు వినిపిస్తోంది. నచ్చితే ఎలాంటి పాత్రకైనా రెడీ అంటుంటాడు నాని. ఇంతుకు ముందు ‘వి’ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించాడు నాని. ఇప్పుడు విజయ్ సినిమాలో విలన్ పాత్రకు కూడా సై అంటాడా!? అన్నది తేలాల్సి ఉంది. ఈ సినిమాలో విజయ్ కి జోడీగా కియారా అద్వానీ నటించనుందట. రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ 27 నుంచి ఆరంభం కానుంది. మరి పవర్ ఫుల్ విలనీకి నాని సై అంటాడా!? లేదా!? లెట్స్ వెయిట్ అండ్ సీ.

-Advertisement-నాని విలనీ ప్రదర్శిస్తాడా?

Related Articles

Latest Articles